Saturday, April 27, 2024

Vishwak Sen | ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి సాలిడ్ అప్డేట్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది… అయితే రిలీజ్ విషయంలో అడ్డంకులు ఏర్పడి వాయిదా పడుతూ వచ్చింది. ఇక రీసెంట్‌గానే ఈ సినిమా ఎట్టకేళలకు మే17 థియేట్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ సినిమాను ఇప్పటి నుంచే గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా నుంచి తాజాగా సాలిడ్ అప్డేట్ ను అందించారు. మూవీ నుంచి ‘మోత’ అనే మాస్ సాంగ్ ను లాంచ్ చేస్తున్నామని తెలిపారు. ఈసాంగ్ విడుదల సందర్భంగా సికింద్రాబాద్ లోని మారెడ్ పల్లి జేబీఎస్ కంటోన్మెంట్ పార్క్ లో ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.మార్చి 25న ఈ సాంగ్ ను ఉదయం 11 : 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ పాటకు అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ అందించడం విశేషమన్నారు. ఇక యువన్ శంకర్ రాజా అదిరిపోయే బీట్ అందించారని, ఈవెంట్ ను సక్సెస్ చేయాలని కోరారు. చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కీలక పాత్రలో మెరవబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement