Sunday, May 5, 2024

అందాల జిలేబిగా శివాని రాజ‌శేఖ‌ర్….

దర్శకుడు కె. విజయ భాస్కర్‌ దర్శక త్వంలో రూపొం దుతున్న చిత్రం ‘జిలేబి’. పారిశ్రామి కవేత్త గుంటూరు రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. అంజు అశ్రాని సమర్పిస్తు న్నారు. విజయ భాస్కర్‌ తనయుడు శ్రీ కమల్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్‌ కథానా యికగా నటిస్తోంది.
ఇప్ప టికే విడుదలైన జిలేబి ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. బ్యాంకాక్‌ లో రెండు పాటలని చిత్రీకరించారు. దీంతో షూటింగ్‌ అంతా పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబో తున్నారు.
రాజేంద్ర ప్రసాద్‌, మురళీ శర్మ, గెటప్‌ శ్రీను, గుండు సుదర్శన్‌, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తుం డగా, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్‌ గా, ఎం.ఆర్‌. వర్మ ఎడిటర్‌ గా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement