Monday, May 6, 2024

HBD | సింపుల్ గా తలైవా బర్త్డే సెలెబ్రేషన్స్..

సూపర్‌స్టార్ రజనీకాంత్ నేటితో 73వ వసంతంలోకి అడుగుపెట్టారు.. తన పుట్టినరోజు వేడుకల్ని కుటుంబసభ్యుల సమక్షంలోనే ఎంతో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు తలైవా. రజనీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఆయన కూతుళ్లు, మనవళ్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్నాయి. ఇక‌, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

ఈ ఏడాది జైలర్‌ సినిమాతో తన కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు రజనీకాంత్‌. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక, జైలర్ సినిమా ఇచ్చిన జోష్ లో రజనీకాంత్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పాటు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లో రజనీకాంత్‌తో పాటు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తోన్నారు. వీరితో పాటు రానా, ఫహాద్ ఫాజిల్‌ మరియు మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement