Saturday, April 27, 2024

ఆదిపురుష్ లో సిద్దార్థ్ శుక్లా ? క్లారిటీ వచ్చేసింది!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్,ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.

రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కూడా కనిపించబోతున్నాడు. ఇక సీతగా కృతిసనన్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ శుక్ల కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడిచింది.

ఇదే విషయమై సిద్దార్ద శుక్లా డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదని ఒకవేళ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక సిద్దార్థ్ శుక్లా చెప్పిన మాటతో ఆ రూమర్ కు చెక్ పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement