Monday, May 6, 2024

శంకర్, రామ్ చరణ్ సినిమా షూట్ కి ముహూర్తం ఫిక్స్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడు. అలాగే సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రోజురోజుకీ అంచనాలు ఎక్కువవుతున్నాయి.

అయితే ఈ సినిమా ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం భారతీయుడు-2 సినిమాకు సంబంధించి వివాదంలో ఇరుక్కున్నాడు శంకర్. ఆ వివాదం నుంచి బయటపడితే జూన్ నాలుగు లేదా ఐదు తర్వాత ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement