Friday, May 10, 2024

పలమనేరు హత్యలో కేసు ట్విస్ట్… పోలీసులు అదుపులో ప్రియురాలి తల్లిదండ్రులు!

చిత్తూరు జిల్లా పలమనేరులో సంచలనం సృష్టించిన ధనశేఖర్ అనే యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ధనశేఖర్ ను బాబు అనే వ్యక్తి కిరాతకంగా చంపేసిన ముక్కలుగా నరికేసి తన పొలంలో పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత బయటపడ్డ ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పొలంతో పాతిపెట్టిన అవయవాలను వెలికితీసిన పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురిని ప్రేమించాడనే కారణంతోనే ధనశేకర్ ను శైలజ తండ్రి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శైలజ తండ్రి బాబు (49) , భార్య సుజాత (40), మైనర్ బాలిక శైలజ (16) పై 302 కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ గంగయ్య కథనం ప్రకారం.. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23)బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే శైలజ(16)ను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో శేఖర్ గతవారం గ్రామానికి వచ్చేశాడు. అయితే, తన కూతురిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బాబు ఈ నెల 22న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి ఫోన్‌ ద్వారా అతడికి మెసేజ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్‌ను చూసి బాబు ఆవేశంతో రగిలిపోయాడు. ధనశేఖర్‌ను బాబు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తన వ్యవసాయ బావిలో పడేశాడు.

మూడు రోజుల తరువాత మృతదేహం ఉబ్బిపోయి పైకి తేలింది. దీంతో హత్య గురించి అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. మృతదేహాన్ని బయటకి తీసి ముక్కలుగా చేసి తన పొలంలో పూడ్చి పెట్టాడు. కొడుకు కనిపించకపోవడంతో ధనశేఖర్ తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాబుపై ఆనుమానం వ్యక్తం చేశారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ కాల్‌డేటాను విశ్లేషించి బాలిక తండ్రే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎంత కిరాతకంగా హత్య చేసిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనశేఖర్‌ను హత్య చేసిన బాబుతో పాటు ఆయనకు సహకరించిన అందర్నీ అరెస్టు చేస్తామని డీఎస్పీ గంగయ్య స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఓటుకు నోటు కేసు: తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement