Saturday, April 27, 2024

షారుక్‌ రెమ్యునరేషన్ 100 కోట్లా..?

బాలీవుడ్ కింగ్‌ ఖాన్‌ షారుక్ ఓ సినిమా కోసం 100 కోట్లు తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి. ‌‌జయాపజయాలతో సంబంధం లేకుండా కింగ్‌ ఖాన్‌ షారుక్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం షారుక్ పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు..అయినప్పటికి విపరీతమైన హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు షారుక్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 2022లో ఈ చిత్రాన్ని  విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, జాన్‌ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్‌’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement