Friday, April 26, 2024

‘shameonyousamantha’ హ్యాష్ ట్యాగ్ వైరల్

అక్కినేని సమంత నటిస్తున్న ది ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా సమంత చుట్టూ వివాదాల ఉచ్చు బిగుసుకుంది. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన తమిళులు… తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా సిరీస్ ఉందని ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని కోరుచున్నారు.

ఈ నేపథ్యంలోనే సేమ్ ఆన్ యు సమంత #shameonyousamantha అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన దర్శక నిర్మాతలు మాత్రం ఈ సిరీస్ లో ఎటువంటి కాంట్రవర్సి లేదని ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం లేదని విడుదలయ్యాక అది అందరికీ అర్థం అవుతుందని చెబుతున్నారు. జూన్ 4న ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement