Wednesday, May 8, 2024

మీరా జాస్మిన్ రీఎంట్రీ షురూ

మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించిన మీరా జాస్మిన్ సూపర్ డూపర్ హిట్ లను అందుకున్నారు. తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని పొందారు. అయితే తెలుగు లో 2013 తర్వాత ఈ అమ్మడు ఎక్కడా కనిపించలేదు. 2014లో దుబాయ్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే వైవాహిక జీవితంలో కొన్ని విభేదాల కారణంగా దుబాయ్ నుండి ఇండియాకు షిఫ్ట్ అయ్యారు.

అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది మీరా జాస్మిన్. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఓ అవకాశం కూడా వచ్చింది. ఓ మలయాళ మూవీ తో మీరాజాస్మిన్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. కాగా మీరా జాస్మిన్ కెమెరా ముందుకు వచ్చి ఐదేళ్ళు అవుతుంది. మరి ఈ రీ ఎంట్రీతో ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement