Sunday, April 28, 2024

బాలయ్యకు విలన్ గా శరత్ కుమార్ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు.

ఇక విలన్ విషయానికి వస్తే తాజాగా తమిళ సీనియర్ హీరో పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు శరత్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నారట. శరత్ కుమార్ అయితే ఈ పాత్రకు బాగుంటుందని అనుకుంటున్నారట. వాస్తవానికి సీనియర్ బాలకృష్ణ క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే కనిపిస్తాడట.. ఆ క్యారెక్టర్ కి విలన్ గా ఫ్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement