Saturday, April 27, 2024

ప్రేమ్ కుమార్ @సంతోష్ శోభన్ కొత్త సినిమా

ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంతోష్ శోభన్. ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయింది. అలాగే ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. అయితే సంతోష్ శోభన్ ఇప్పుడు సారంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

కాగా ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే 80 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమాని ప్రకటించడంతో పాటు టైటిల్ ను కూడా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement