Monday, May 6, 2024

సందీప్ కిషన్ కామన్ డీపీ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కాగా మే 7వ తేదీన సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కొంతమంది తెలుగు, తమిళ దర్శకులు సందీప్ కిషన్ బర్త్ డే కామన్ డిపి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అంతేకాకుండా సందీప్ కిషన్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇటీవల సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు గల్లీ రౌడీ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వివాహ భోజనంబు సినిమా సెట్స్ పై ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల కరోనా తో చనిపోయిన వారి పిల్లల చదువులు, తినడానికి తిండి రెండు సంవత్సరాల పాటు అన్ని చూసుకుంటానని చెప్పి తన మంచి హృదయాన్ని చాటుకున్నాడు సందీప్. ప్రస్తుతానికి సందీప్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రేపు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement