Friday, May 3, 2024

ఎన్టీఆర్30 షూట్ లో.. జాయిన్ అయిన సైఫ్ ఆలీఖాన్

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్30అని వ‌ర్కింగ్ టైటిల్ ని పెట్టారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. ఈ మేర‌కు షూటింగ్ కోసం హైద‌రాబాద్ చేరుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ జాయిన్‌ అయ్యారు. ఈ సినిమాలో సైఫ్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ నటుడు హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారని సైఫ్‌తో తారక్‌, కొరటాల శివ కలిసి ఉన్న ఫోటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. ీ చిత్రంలో హీరో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్‌.నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌30’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement