Friday, April 26, 2024

ఇప్పుడు స‌రే.. నాటి ఆర్ ఆర్ ఆర్ లు ఎవ‌రో తెలుసా

ఆర్ ఆర్ ఆర్ సృష్టించిన సంచ‌ల‌నాలు అన్నీ కావు. రాజ‌మౌళి..రామ్ చ‌ర‌ణ్.. రామారావు ఈ పేర్లే ఆర్ ఆర్ ఆర్ అంటే. కానీ మ‌రో ముగ్గురు ఆర్ ఆర్ ఆర్ లు సీనియ‌ర్ ఎన్టీఆర్ కాలంలో ఉన్నార‌ని ఓ వీడియోని పోస్ట్ చేశారు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. ఈ మేర‌కు ఓ ఆసక్తికర, అరుదైన వీడియో పంచుకున్నారు. అందులో సీనియ‌ర్ న‌టుడు ఎన్టీ రామారావు, రామానాయుడు, రాఘవేంద్రరావు ఓ కార్యక్రమంలో భోజనం చేస్తున్నారు. దీనిపై రాఘవేంద్రరావు స్పందిస్తూ… ఆ రోజుల్లోనే RRR కాంబినేషన్… అరుదైన వీడియో… రామారావు , రామానాయుడి తో మీ రాఘవేంద్రరావు అంటూ చమత్కరించారు. రామారావు, రామానాయుడు, రాఘవేంద్రరావు పేర్లు R తోనే ప్రారంభం అవుతాయి. ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో ఉండడం చూస్తే, అది ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల నాటి వీడియో అని తెలుస్తోంది.మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ అంటూ భ‌లే వీడియో పోస్ట్ చేశారు ద‌ర్శ‌కేంద్రుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement