Thursday, November 7, 2024

త్వ‌ర‌లోనే.. భోళా శంక‌ర్ పాట‌లు

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం భోళాశంక‌ర్. ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. క భోళాశంకర్ పాటల సందడికి వేళైందని వెల్లడించింది. త్వరలోనే భోళాశంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని వివరించింది. భోళాశంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ మెగా ఫ్యాన్స్ కు తియ్యని కబురు చెప్పింది. భోళాశంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెహర్‌ రమేష్‌ ప్రత్యేకించి కొన్ని సీన్లను ప్లాన్‌ చేస్తున్నార‌ట. శంకర్‌ దాదా ఎమ్‌బీబీఎస్‌ తరహాలోనే టైటింగ్‌ కామెడీని సృష్టించబోతున్నాడట.

మేయిన్‌ ప్లాన్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌తోనే సాగిన.. మెగాస్టార్‌ తాలుకూ కామెడీ పుష్కలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మెహర్‌రమేష్ చిరంజీవిని స్టైలిష్‌ అవతారంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య మంచి కంబ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఈ సినిమాతో దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. మెహర్ రమేష్‌ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట. ఎలాగయినా చిరుకు అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరుకు చెళ్లెలుగా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement