Sunday, April 28, 2024

చరణ్ శంకర్ సినిమాలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీటి తరువాత శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కీయరా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. ఇద్దరిలో ఎవరు ఫైనల్ చేస్తారని ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement