Thursday, March 28, 2024

‘కియా మోటార్స్’ పేరు మార్పు.. ఇకపై ‘కియా ఇండియా’

‘కియా మోటార్స్’ సంస్థ దేశంలో అడుగుపెట్టిన రెండేళ్లలోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. తాజా ఈ కంపెనీ పేరు మార్చుకుంది. ఇకపై కంపెనీ పేరును ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్టు తెలిపింది. కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. కంపెనీ బ్రాండ్‌కు కొత్త పేరు మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు అనంతపురంలోని కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పేరు, లోగోలో మార్పులు చేసింది. దశలవారీగా డీలర్‌షిప్ కేంద్రాల వద్ద కూడా మార్పులు చేయనున్నట్టు కియా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement