Monday, April 29, 2024

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘లవ్ టుడే’

కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్ టుడే’. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవాన నటించింది. ఇక ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ మూవీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. AGS ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి ఈ మూవీ బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement