Thursday, May 2, 2024

IPL | దంచికొట్టిన కోహ్లీ, డుప్లీసెస్​.. బెంగళూరు ఈజీ విన్​

ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి హైదరాబాద్​లోని ఉప్పల్​ స్డేడియంలో ఈ మ్యాచ్​ ఉత్కంఠను రేపింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. బెంగళూరుకు 172 పరుగుల టార్గెట్​ నిర్ధేశించింది. కాగా, ఈ జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్​ డూప్లిసెస్​, కింగ్​ విరాట్ కోహ్లీ వచ్చారు. వీరిద్దరు కలిసి ముంబై బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ముందుగా హాఫ్​ సెంచరీ నమోదు చేసుకున్న డూప్లిసెస్​ దూకుడు మీదుంటే.. ఆ తర్వాత కొద్ది సేపటికే దీటుగా ఆడి కోహ్లీ హాఫ్​ సెంచరీ చేశాడు. దీంతో స్టేడియంలో కోహ్లీ కోహ్లీ అంటూ పెద్ద పెట్టున అరుపులు, కేకలు వినిపించాయి. కోహ్లీ కూడా బ్యాట్​ని పైకెత్తి, మరో చేత్తో గుండెలపై చూపిస్తూ అభిమానులను ఎంకరైజ్​ చేశాడు.

ఇక.. 15వ ఓవర్​లో డూప్లిసెస్​ సిక్స్​ బాదబోయి బోర్డర్​లో క్యాచ్​గా దొరికిపోవడంతో అతని ఆట ముగిసింది. దీంతో క్రీజులోకి దినేశ్​ కార్తీక్​ వచ్చి ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత  మ్యాక్స్​వెల్ 12 ​తో కలిసి.. కింగ్​ కోహ్లీ 82 పరుగులతో నాటౌట్​గా నిలిచి ఆటను కంప్లీట్​ చేశాడు.. బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం రెండు వికెట్ల నష్టంతోనే బెంగళూరు జట్టు ముంబైపై సునాయసంగా గెలిచింది. ఎనిమిది వికెట్ల విజయాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement