Thursday, May 9, 2024

కరోనా బాధితులకు రేణు దేశాయ్ హెల్ప్ లైన్

కరోనా కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ అందక మందులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఆఖరికి చనిపోతున్నారు. ఇక అలాంటి వారికి సహాయం చేయడానికి చాలామంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. అందులో రేణుదేశాయ్ కూడా ఒకరు. రేణు దేశాయ్ ఎటువంటి సహాయం కావాలన్నా తనకు కాల్ చేయాలంటూ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఆ నెంబర్ కు ప్రతిరోజు వందల సంఖ్యలో కాల్స్ మెసేజ్లు వస్తున్నాయట.

ఇక అందులో కొంతమందికి రేణుదేశాయ్ సాయం చేస్తున్నారట. ఇంస్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా గానే బాగానే ఉంది. ఎవరికి అవసరం వచ్చినా మెసేజ్ చేస్తున్నారు. వెంటనే రేణు దేశాయ్ కూడా స్పందిస్తుంది.మొత్తం ఒక రోజులో రేణుదేశాయ్ 18 గంటలకు పైగా ప్రస్తుతం పనిచేస్తుందట. సమాచారాన్ని షేర్ చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయడానికి రేణుదేశాయ్ ప్రయత్నిస్తున్నారట. అంతేకాకుండా ఈ విషయంలో తనకు చాలా మంది దాతలు సహాయంగా నిలుస్తున్నారని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఒక్కరికైనా సహాయం చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుందని రేణుదేశాయ్ అన్నారు. నేను చేస్తున్న సాయం జస్ట్ ఫోన్ లో సమాచారాన్ని షేర్ చేసుకోవడం. ఇది ఎలాంటి సహాయమో నాకు నాకు తెలియదు. కానీ చాలా మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు రేణు.

Advertisement

తాజా వార్తలు

Advertisement