Thursday, May 2, 2024

రికార్డులు బద్దలకొడుతున్న రెబల్ స్టార్.. అమెరికాలో ‘స‌లార్’ ప్రీమియర్ షోలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “స‌లార్” మూవీకి హైప్ మామూలుగా లేదు. భారతదేశంలోనే కాకుండా.. విదేశాలలో రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఓవర్సీస్ లో ఈ సినిమా స్క్రీనింగ్ లొకేష‌న్స్ పరంగా భారతీయ సినిమాల‌కే కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయ‌నుంది. సెప్టెంబర్ 27 రిలీజ్ కానున్న ఈ మూవీ USA అంతటా ఏకంగా 1979 లొకేషన్‌లలో విడుదల కానుంది. భారతీయ సినిమాకు ఇదే సరికొత్త రికార్డు.

కాగా ‘‘స‌లార్” మూవీ రెండు భాగాలుగా రానుంది. “సలార్ 1 – సీజ్ ఫైర్” అనేది ఫ‌స్ట్ పార్ట్ టైటిల్. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్‌కు 120 మిలియన్లకు పైగా రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement