Thursday, May 2, 2024

కేదార్‌నాథ్‌లో ఆంక్ష‌లు.. సెల్‌ఫోన్ నిషేధం విధించిన ఆల‌య క‌మిటీ

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని నిర్వహిస్తున్న బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ.. ఆలయ ప్రాంగణం లోపల మొబైల్ ఫోన్‌లను నిషేధించింది. ఒక‌ యూట్యూబర్ కేదార్‌నాథ్ ఆలయం వ‌ద్ద‌ తన ల‌వ‌ర్‌కి ప్రపోజ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ కావ‌డంతో కొంత మంది అబ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల కేదార్‌నాథ్ ఆలయ పవిత్రత దెబ్బతింటోందని భ‌క్తులు అంటున్నారు.

దీంతో ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్‌లను ఆలయ కమిటీ నిషేధించింది. అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలోని పలు చోట్ల అధికారులు ‘మొబైల్ ఫోన్లతో ఆలయ ప్రాంగణంలోకి రావద్దు’ అని బోర్డులు పెట్టారు. ఆలయం లోపల ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేప‌ట్టొద్ద‌ని రూల్స్ పెట్టారు. CCTV కెమెరాల నిఘా కూడా పెంచారు. యాత్రికులు కూడా నిరాడంబరంగా దుస్తులు ధరించాలని కోరినట్లు ఆల‌య క‌మిటీ ప్రెసిడెంట్ అజయ్ అజేంద్ర తెలిపారు.

- Advertisement -

ఈ ఆదేశాలను పాటించని యాత్రికులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బద్రీనాథ్ ధామ్ నుండి ఇంకా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అందువల్ల అక్కడ నిషేధం విధించలేదని అజేంద్ర చెప్పారు. అధికారులకు ఫిర్యాదు అందితే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement