Sunday, April 28, 2024

ఏపీఎస్ఆర్టీసీకి వంద ఎలక్ట్రిక్ బస్సులు.. సరఫరా చేసిన ఓలెక్ట్రా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్​ఆర్టీసీ)కు ఓలెక్ట్రా గ్రీన్ టెక్ వంద బస్సులను సరఫరా చేసింది. ఇప్పటికే 88 బస్సులను అందించింది. మిగిలిన 12 బస్సులను సోమవారం అందజేసింది. ఈ 12 బస్సులను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి తిరుపతికి ఆర్టీసీ నడపనుంది. వీటిని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మదనపల్లి ఆర్టీసీ డిపోలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఏపీ ఎస్​ఆర్టీసీకి వంద ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నట్టు జరిగిన ఒప్పందం ప్రకారం.. దశలవారీగా బస్సులను ఒలెక్ట్రా సరఫరా చేసింది. ప్రస్తుతం 50 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు నడుస్తున్నాయి. తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 14 బస్సులు, కడప నుంచి తిరుపతికి 12 బస్సులు, నెల్లూరు నుంచి తిరుపతి 12 బస్సులు నడుస్తున్నాయి. తాజాగా మదనపల్లి నుంచి తిరుపతి 12 బస్సులు సోమవారం నుంచి నడుస్తున్నాయి. ఇవన్నీ అత్యాధునిక సదుపాయాలున్న ఏ సి బస్సులే.

Advertisement

తాజా వార్తలు

Advertisement