Friday, May 3, 2024

రవితేజ కొత్త సినిమా అప్డేట్ ?

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా… తాజా సమాచారం ప్రకారం మరొక హీరోయిన్ నభా నటేష్ నటిస్తున్నారట. ఇక ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది.అంతేకాకుండా రవితేజ క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్ ఈ సినిమాలో భలే ఉంటాయట.

గతంలో నేను లోకల్, సినిమా చూపిస్త మామ వంటి చిత్రాలతో మంచి హిట్ సాధించాడు త్రినాథ్. ఇక రవి తేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా త్రినాథరావు నక్కిన రవితేజ కాంబినేషన్ లో సినిమా అంటే ఇంక ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై అంతే ఆతృత తో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement