Tuesday, May 14, 2024

Rasi : ఈ రాశి ఎలిజబెత్ టేలర్…

అందాల రాశీ ఎలిజ‌బెత్ టేల‌ర్ లా.. బ్రిటీష్ మ‌హారాణిలా క‌నిపిస్తోంది క‌దూ? ఈ రెట్రో లుక్ చూడ‌గానే బోయ్స్ వ్వావ్ అన‌కుండా ఉండ‌లేరు. ఒక‌ప్ప‌టి రాణుల రాజ‌సం ద‌ర్పం రాశీలో కనిపిస్తోంది. తాజాగా రాశీ షేర్ చేసిన ఫోటోషూట్ లో త‌న లుక్ గురించి త‌నే ఒక వ్యాఖ్య‌ను కూడా జోడించింది. విత్ ఏ సైడ్ ఆఫ్ ఓల్డ్ హాలీవుడ్ గ్లామ్.. అనే కొటేష‌న్ ని దీనికి అటాచ్ చేసింది. అంటే త‌న రూపం పాత హాలీవుడ్ గ్లామ‌ర్ క్వీన్స్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన‌ది అని నిజాయితీగా అంగీక‌రించింది.

దానికి త‌గ్గ‌ట్టుగానే రాశీ ఫోటోషూట్ ని డిజైన్ చేసారు ఫోటోగ్రాఫ‌ర్. అయితే రాశీకి తెలియ‌ని విష‌యం ఏమంటే.. త‌న‌ను ఒక యాంగిల్ లో చూస్తుంటే టైటానిక్ షిప్ లో యువ‌ రాణిలా క‌నిపిస్తోంది. ఒక‌వేళ అదే టైటానిక్ షిప్ పై కేట్ విన్ స్లెట్ కి స్వ‌యంగా ఒక సిస్ట‌ర్ ఉండి ఉంటే అది రాశీలా ఉంటుంది అని కూడా గెస్ చేస్తున్నారు బోయ్స్. ఏది ఏమైనా రాశీ అంద‌చందాల‌కు ఫిదా క‌ని వారే లేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement