Sunday, May 5, 2024

సూపర్ హీరో చిత్రం లో రానా

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు దగ్గుబాటి రానా. రానా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ… తాను ఓ సూపర్ యాక్షన్ హీరో చిత్రంలో నటించబోతున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర, స్క్రిప్ట్, తారాగణం ఇతర విషయాలను మాత్రం చెప్పలేదు.

త్వరలోనే సూపర్ హీరో చిత్రంలో నటించబోతున్నాను అనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఇక రానా ఆఖరిగా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తాను నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement