Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో కంపించిన భూమి..

చిత్తూరు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో శుక్రవారం భారీ శబ్ధాలు వినిపించాయి. ఉదయం నుంచి రెండుసార్లు శబ్ధాలు రావడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  దాదాపు 6 సెకన్ల పాటు భూమి కంపించినట్లు మాచారం. ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ సంఘటనలతో తీవ్రంగా భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ వైపు మూడు రోజులుగా కురుస్తున్న భారీ​ వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరో విపత్తు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసింది.

ఇది కూడా చదవండి : పథకాల కోసమే పెట్రో టాక్స్ తగ్గించడం లేదు: గోరంట్ల బుచ్చయ్య..

Advertisement

తాజా వార్తలు

Advertisement