Saturday, April 27, 2024

రామ‌బాణం పోస్ట‌ర్.. అదిరిన గోపిచంద్..జ‌గ‌ప‌తిబాబు లుక్

రామ‌బాణం చిత్రం నుండి పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ పోస్ట‌ర్ లో హీరో గోపిచంద్.. జ‌గ‌ప‌తిబాబు లుక్ అదిరింది.ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించారు.శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఈ పోస్ట‌ర్ లో గోపీచంద్..జ‌గ‌ప‌తిబాబు ట్రెడిష‌న‌ల్ లుక్ లో మెరిశారు..వారిద్ద‌రు చేయి చేయి క‌లిపిన‌డుస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ న‌టిస్తున్నారు..ఆయ‌న‌కి ఇది 30వ చిత్రం. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో జ‌గ‌ప‌తిబాబు, సచిన్‌ ఖేడ్‌ ఖర్‌, నాజర్‌, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్‌, సప్తగిరి,కాశీ విశ్వనాథ్‌, సత్య,గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్‌ అరోరా, తదితరులు నటిస్తున్నారు. 2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్‌ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. 2023 వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement