Sunday, May 19, 2024

Rajinikanth | రిలీజ్‌కి రెడీ అయిన సూపర్ స్టార్ “వెట్టైయన్”

టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రజనీకి 170వ సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పటి నుంచి ప్రేక్షకులు, అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, రానా దగ్గుబాటితో పాటు, అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫజిల్, మంజు వారియర్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, రితికా సింగ్, దుషార విజయన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement