Sunday, April 28, 2024

Anupama : లిల్లీ ఇక డోస్ పెంచొద్దు…

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో టిల్లు కామెడీ, డైలాగ్స్ కు యూత్ ఫిదా అయిపోయారు. రిపీట్ మోడ్ లో సినిమా చూసేస్తున్నారు కుర్రాళ్లు.

అయితే ఈ సినిమా విజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నా.. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. బబ్లీ గర్ల్, సాంప్రదాయంగా ఉండే అమ్మాయిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అనుపమ.. ఈ సినిమాతో తనలోని మరో రూపం చూపించింది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ యాక్ట్ చేసింది. కారులో సిద్ధుతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లో నటించి అదరగొట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఇలా హోమ్లీగా కనిపించిన అనుపమ.. ఎందుకు బోల్డ్ క్యారెక్టర్ చేసిందని తెగ ప్రశ్నలు వేశారు. అయితే నటిగా అన్ని పాత్రలు చేయాలని ఆమె ఆన్సర్ ఇచ్చింది. లిల్లీ రోల్ కోసం ఎంతో కష్టపడ్డానని కూడా చెప్పింది. రొమాంటిక్ సీన్స్ ఎంతో ఈజీ అనుకుంటారని, కానీ నేచురల్ గా చేయడం చాలా కష్టమని చెప్పింది. చూసేవారికి ఎలా ఉన్నా.. చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. మరి ఈ బ్యూటీ తన నెక్స్ట్ సినిమాల్లో ఇదే బోల్డ్ నెస్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది.

- Advertisement -

ప్రస్తుతం అనుపమ చేతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఆక్టోపస్ చిత్రంలో ఈ అమ్మడు లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందుతున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో కూడా నటిస్తోంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మాలీవుడ్ లో మళ్లీ సందడి చేయనుంది. వీటితోపాటు మరికొన్ని సౌత్ సినిమాలు చేస్తోందీ బ్యూటీ. ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనుపమ.

ఛాన్స్ దొరికితే సూపర్ యాక్టింగ్ తో పాటు సాంగ్స్ లో గ్లామరస్ గా కనిపించాలి. ప్రస్తుతం అనుపమ కోసం మేకర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం డోస్ పెంచినా కూడా కెరీర్ కు డేంజర్. గ్లామర్ తోనే ఇండస్ట్రీలో నిలదొకుంటారు అనే మాటలో అర్థం లేదు. ఇక కంటెంట్ ఉన్న క్యారెక్టర్ లో కాస్త గ్లామర్ హీట్ పెంచినా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అనుపమకు ఈ సమయం చాలా కీలకం. మరి అమ్మడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement