Tuesday, May 14, 2024

‘రుద్రుడు’గా రాఘవ లారెన్స్‌ .. ఏప్రిల్ లో థి‌యేట‌ర్ల‌లోకి

నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కధానాయకుడిగా రూపొందుతున్న చిత్రం రుద్రుడు. కతి రేసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్ర మిది. ఈ సినిమా విడుదల తేది ఖరారైయింది. వచ్చే వేసవిలో ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో లారెన్స్‌ తలకు గాయంతో కనిపిస్తున్నారు. ”ఈవిల్‌ ఈజ్‌ నాట్‌ బోర్న్‌, ఇట్‌ ఈజ్‌ క్రియేటడ్‌” అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌ సరి కొత్తగా కనిపిస్తారు. సినిమా విడుదల తేదిని తెలియజేస్తూ దర్శక, నిర్మాత కతిరేసన్‌ ప్రకటన చేశారు. ‘పొల్లాధవన్‌’, ‘ఆడుకాలం’, ‘జిగర్తాండ’, ‘డైరీ’ వంటి విజయవంతమైన చిత్రాల వరుసలో రుద్రుడు ఉంటుంది.

రాఘవ లారెన్స్‌ మాస్టర్‌ కాంచన-3 విడుదలై దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించదానికి మావంతు గొప్ప కృషి చేస్తున్నాం. రుద్రుడు ముందుగా థియేటర్లలో క్రిస్మస్‌ విడుదలకు ప్రకటించినప్పటి వీఎఫ్‌ ఎక్స్‌ పనులు పూర్తి కావడనికి మరికొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. అని కతిరేసన్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్‌ సరసన ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ డి రాజశేఖర్‌-ఐఎస్‌ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement