Friday, April 26, 2024

ఆర్.ఆర్.ఆర్ డిజిటల్ రైట్స్…ఫుల్ డీటెయిల్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. మరోవైపు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా కు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను పూర్తిచేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అలాగే హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇంగ్లీష్, కొరియన్, టర్కిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 13న న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement