Thursday, May 2, 2024

పుష్ప రికార్డ్స్ ఆగట్లేదు!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. మొత్తం 30 ప్లస్ మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇప్పటికే ఈ సాంగ్ విడుదల చేసిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్‌ వీడియోగా రికార్డ్ సృష్టించింది. 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement