Monday, April 29, 2024

అనసూయ గా ప్రియా ప్రకాష్ వారియర్

నూతన దర్శకుడు రాజు దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇష్క్. ఏప్రిల్ 23 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ప్రియ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ… ఈ సినిమాలో అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్ర తనదని…సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక కాలేజీ గర్ల్ గా కనిపించబోతున్నాడని తెలిసింది.

ఇక తెలుగు డైలాగ్స్ పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని సినిమా చేసేటప్పుడు డైలాగ్స్ తీసుకుని తెలుగులో ప్రాక్టీస్ చేసి వచ్చేదానినని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు కన్నుగీటు తో కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement