Friday, April 19, 2024

కోడెగిత్తల జోరు- కుర్రకారు హుషారు

కోనంగి పల్లి లో ఉరకలేసిన ఉల్లాసం..! –.– వందలలో పశువులు.. వేల సంఖ్యలో ప్రజలు– జన సముద్రం గా మారిన కోనంగి పల్లి వెదురుకుప్పం: – రంకెలేసిన కోడెగిత్తలు.. కుర్రకారు హుషారు గా నిలవడంతో ఓక్కసారి గా కోనంగి పల్లి లో ఉత్సాహం ఉరకలేసింది..! మండలం లోని పచ్చి కాపల్లం పంచాయతీ కోనంగి పల్లి గ్రామంలో ఆదివారం జల్లికట్టు(ఎడ్ల పందాలు)దుమ్ములేపాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో యువకులు ఎడ్లతో గ్రామానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. ముందుగా గ్రామంలో నడివిదిలో ఆల్లినీ ఎర్పాటు చేసారు.ఇందులో నిలిచి పశువుల ను పట్టుకోవాలి తండోరా వేశారు. పండుగ నిర్వహించే వీధిలో సిమెంట్ రోడ్డు పై మట్టిని తోలి పశువుల పండుగ కు సిద్దం చేశారు. ఈ క్రమంలో ఎడ్ల కొమ్మలు కు పలకలు,బట్టలు,బెలూన్లు,బహుమతులు కట్టి పందేనికి సిద్దం చేశారు. అప్పుటికే వేల సంఖ్యలో చుట్టుపక్కన మండలాల నుంచి ప్రజలు గ్రామానికి చేరుకోన్నారు.గ్రామానికి చేరుకున్న కొందరు యువత ఎడ్లను నిలువరించేందుకు పోటీ పడ్డారు. మరి కొందరు యువకులు పోట్టిగిత్తలను నిలువ‌రించి చెక్క పలకలు ను సొంత చేసుకున్నారు.యువకులు కు చిక్కకుండా యద్దులు వెళ్ళడం తో యజమానులు సంతోషం అంతా ఇంతా కాదు. గ్రామాల్లో పశువుల పండుగ గ్రామస్తులంతా ఐక్యమత్యంతో పండుగ జరుపుకోవడంతో గతంలో ఏపుడూ లేని విధంగా పండుగ జరిపి చరిత్ర సృష్టించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని వదలకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పండుగ తరువాత గ్రామాల్లో నిర్వహించే పశువుల పండుగ ను ఈ సంవత్సరం కూడా కోనంగి పల్లి గ్రామంలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉషారు గా యువకులు పశువుల ను సాంప్రదాయబద్దంగా పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.కరోనా మహమ్మారి విస్తృతంగా వ్వాపిస్తున్న నేపథ్యంలో,ఎన్నికల కోడ్ అమలలో వుందనీ పోలీసులు పశువుల పండుగ కు ఆనుమతులు ఇవ్వకపోయినా …గ్రామస్తులంతా పట్టుదలతో సాంప్రదాయాన్ని యధావిధిగా కొనసాగించాలంటూ ఘనంగా పశువుల పండుగ నిర్వహించారు. ఈ పండుగలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని యువకులు,పెద్దలు గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పండగ జరగడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు.దీంతో పశువుల పండుగ ప్రశాంతంగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement