Saturday, April 27, 2024

Kannappaలో నాయిక ప్రీతి ముకుందన

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో ఇప్పటికే పలువురు స్టార్స్‌ నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇందులో నాయికగా ప్రీతి ముకుందన్‌ను ఎంపికచేసినట్టు వారు వెల్లడించారు.

తొలుత ప్రీతికి ఆడిషన్స్‌ నిర్వహించారు. ఆ తర్వాతే ఎంపికచేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు. చిత్ర దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రీతికి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినీరంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమెతో కలిసి పనిచేయడానికి యూనిట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement