Friday, May 17, 2024

Kalki 2898 AD | అదిరిపోయిన ప్రభాస్ లుక్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభ‌మై 2898 సంవ‌త్స‌రంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 09న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక‌ ఇప్ప‌టికే మూవీ నుంచి విడుదలైన దీని గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇదిలావుంటే మ‌హాశివ‌రాత్రి సందర్భంగా.. మూవీ నుంచి ప్ర‌భాస్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాలో ప్ర‌భాస్ భైర‌వ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement