Sunday, May 5, 2024

Lok Sabha – 36 మందితో కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్…తెలంగాణ నుంచి న‌లుగురికి చోటు

న్యూఢిల్లీ – లోక్ స‌భ‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జహీరాబాద్- సురేష్ షట్కర్, , నల్గొండ – కుందూరు రఘువీర్, మహబూబాబాద్ – బలరాం నాయక్ , మహబూబ్ నగర్ – వంశీచంద్ రెడ్డి పేర్లను ఏఐసీసీ అనౌన్స్ చేసింది.

వాయనాడ్ నుంచే రాహుల్ గాంధీ..

మొత్తం 36 మందితో కూడిన జాబితాలో రాహుల్ గాంధీ, శశిథరూర్, గీతా శివరాజ్ కుమార్, డీకే సురేష్.. వంటి సీినియర్ల పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచే లోక్‌సభకు పోటీ పడనున్నారు.
తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్- 6, కర్ణాటక- 6, కేరళ- 15, మేఘాలయా-2, నాగాలాండ్-1, సిక్కిం- 1, త్రిపుర- 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ స్థానానికి శాండల్‌వుడ్ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement