Monday, April 29, 2024

అభిమానులకు ముద్దులు ఇచ్చేస్తున్న బుట్టబొమ్మ !!

ప్రస్తుతం పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇక అలాగే సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. అయితే ఈ ఫాల్లోవర్స్ విషయంలో సమంత తో పూజ హెగ్డే పోటీపడుతోంది. గత నెలలోనే సమంత ఫాలోవర్లు 13 మిలియన్లకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ మార్క్ ను పూజా హెగ్డే అందుకున్నారు. తనకు 13 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో పూజాహెగ్డే ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

తన అభిమానులు అందరికీ కూడా హగ్గులు,ముద్దులు విసిరేస్తుంది. వర్చువల్ హగ్స్ అంటూ ఎమోజీ లను షేర్ చేస్తూ కూడా పోస్టులు పెడుతుంది. 13 మిలియన్ల కి చేరుకున్నాను. అందరికీ థాంక్స్. మీ అందరికీ హగ్స్, ముద్దులను పంపిస్తున్నాను అంటూ ఓ క్యూట్ ఫోటోని షేర్ చేసింది. ఇక పూజా ప్రస్తుతం రాధే శ్యామ్ ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ,ఆచార్య సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/reel/CNhzfvihLBT/?igshid=pfmx3yxqzu6w

Advertisement

తాజా వార్తలు

Advertisement