కరోనా వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒకే దేశం-ఒకే పన్నును రాష్ట్రాలు అంగీకరించాయని, అలాంటప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని ప్రధాన మంత్రి కేర్స్ నిధుల నుంచి భరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్‌ను రూ.150కి, రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తామని వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలన్న స్ఫూర్తికి అసలు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందా? అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్కో వ్యాక్సిన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement