Monday, April 29, 2024

ఆర్ఆర్ఆర్ షూట్ రీస్టార్ట్ కి ప్లాన్ షురూ!!

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఒక్కో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగానే ఆర్ఆర్ ఆర్ టీం కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. కాగా జూలై 1 నుంచి ఈ సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కరోనా కారణంగా రెండు సార్లు ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. 70 శాతం షూటింగ్ ను ఈ చిత్రం ఇప్పటికే పూర్తి చేసుకోగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి.

కాగా విడుదల తేదీపై మాత్రం ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మొదట ప్రకటించారు. కానీ ఆ సమయానికి కష్టమే అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ తో పాటు అజయ్ దేవగన్ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement