Wednesday, May 15, 2024

39 మంది భార్యల ముద్దుల మొగుడు బతికే ఉన్నాడట!

39 మంది భార్యలు కలిగిన మిజోరం రాష్ట్రానికి చెందిన బిగ్ ఫ్యామిలీ మ్యాన్ జియోనా చానా ఆదివారం మరణించాడు. అయితే, ఆయన బతికే ఉన్నాడంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జియాన్‌ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు.

మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోన అనారోగ్యంతో మరణించినట్టు ఆదివారం వైద్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. జియోన శరీరం వెచ్చగా మారడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన బతికే ఉన్నారని నమ్ముతున్నారు. ఆయన పల్స్ బీట్ కూడా మొదలైందని, కాబట్టి అంత్యక్రియలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు. కాగా, 39 మంది భార్యలు, 90 మందికిపైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద  కుటుంబానికి అధిపతిగా  రికార్డులకెక్కాడు.

ఇదీ చదవండి: పల్లెల రూపురేఖలు మార్చే ప్రణాళికలు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement