Friday, May 3, 2024

టక్ జగదీష్ రిలీజ్ కు రెండు ముహుర్తాలు ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే నిజానికి ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక దీంతోపాటు చాలా సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై నెలాఖరున విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది కుదరకపోతే ఆగస్టు 3వ వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement