Sunday, April 28, 2024

ఓటీటీ లో ఫ్యామిలీ హీరో కొడుకు సినిమా ?

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా గౌరీ రోనక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. గతంలో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే పెళ్లి సందD సినిమాకు రాఘవేంద్ర రావు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కూడా కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లతో చర్చలు జరుపుతున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement