Friday, April 26, 2024

వ్యాక్సిన్లపై విషం చిమ్ముతున్నారు: కేటీఆర్ కు డీకే అరుణ కౌంటర్

రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సరఫర చేసే విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని చెప్పారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.  కల్లులేని కబోదిలా కేంద్రంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నాయకులు ప్రజల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత్ బయోటెక్ ను ఒక్కసారైనా సందర్శించారా ? అని అరుణ ప్రశ్నించారు. ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం నుంచి ఏనాడైనా సహాయం చేస్తామని హామీ ఇచ్చారా? అని నిలదీశారు.

ప్రధాని మోదీ కంపెనీని సందర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పరిశ్రమ శాఖ మంత్రిగా కేటీఆర్ ఏం సాధించారని అడిగారు. మనకు ఇవ్వకుండా విదేశాలకు ఇస్తున్నారని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ట్విట్టర్ మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో తయారు అయిన ఉత్పత్తులు ఇక్కడే అమ్ముతున్నారా ? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో సిబ్బంది లేరని, రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదన్నారు. ఇంటింటికి వెళ్లి టెస్టులు చేస్తున్నామంటున్న ప్రభుత్వం… ఇప్పటి వరకు ఎంత మందికి టెస్టు చేశారని ప్రశ్నించారు. దేశజనాభాతో ఇతర దేశాలతో పోలుస్తామా ? అని అడిగారు. విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్ లను పరీక్షలు లేకుండా ఇస్తారా ? అని ప్రశ్నించారు. దేశంలో తయారైన వాటికంటే ఎక్కువ ధర ఉన్న వ్యాక్సిన్ తెప్పించుకుని డబ్బులు దంకుందనుకుంటున్నారా ? అంటూ డీకే అరుణ మండిపడ్డారు.

దేశంలో వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని గర్వపడాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఏనాడైనా ప్రజలకు చెప్పారా ? అని నిలదీశారు.  వ్యాక్సినేషన్ పై దశ్ప్రాచారం చేశారే తప్ప.. ప్రజలకు విశ్వాసం కల్పించలేదని విమర్శించారు. తెలంగాణలో వ్యాక్సిన్ ను వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందం మేరకే వ్యాక్సిన్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తప్పులు చేసి.. దానిని కేంద్ర ప్రభుత్వంపై వేస్తున్నారని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని అరుణ ప్రశ్నించారు. కరోనా చికిత్స కు అవసరమైన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా ? అని నిలదీశారు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు కుట్రతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  కల్లాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement