Wednesday, April 17, 2024

ఆదిపురుష్ నుంచి మరో క్రేజీ అప్డేట్

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతిసనన్ కనిపించనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.

ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడట. అయితే అది ఏ పాత్ర అనే దానిపై స్పష్టత రాలేదు. జూలై లాస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ అప్డేట్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement