Monday, April 29, 2024

పవన్ పూరీ సినిమా నిజం కాదట !!

పవర్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాల లో నటిస్తున్నాడు పవన్. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు లేదట. ఇదే విషయాన్ని పూరి సన్నిహితులు కూడా చెబుతున్నట్లు సమాచారం. కాగా గతంలో పూరీ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు, బద్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement