Friday, April 19, 2024

టైటిల్ అదిరిపోయింది @అనుష్క నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా !!

జాతి రత్నాలు సినిమాతో ఫేమస్ అయిపోయాడు నవీన్ పోలిశెట్టి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే అందులో అనుష్క తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ పరిశీలిస్తున్నారట. ఆ టైటిల్ మరేదో కాదు. మిస్ శెట్టి…. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా 40 ఏళ్ల మహిళతో పాతికేళ్ల వయసులో ఉన్న కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అని ఓ యాంగిల్ లో ఉండబోతుందట. అంతేకాకుండా ఎమోషనల్ అలాగే కామెడీ తో ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement