Sunday, May 5, 2024

టాలీవుడ్ లో యూత్ కి మంచి అవకాశం…

పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , నిర్మాత టి. జి విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా 15 సినిమాలు నిర్మించడానికి రూపకల్పన చేసారు. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు, 6 మధ్య తరహా చిత్రాలు, 3 భారీ చిత్రాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిభావంతులైన యువతకి ప్రోత్సాహం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేర అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కోట్లాది మంది అభిమానులను మెప్పించే పవన్ స్టార్… ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచే నేత శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ నవ్యరీతి చిత్రాలను, సృజనాత్మక కథలను ఇష్టపడతారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను… బహుభాషల్లో మన కథలను తీసుకు వెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించారు. నిర్మాత శ్రీ టి.జి.విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. ద్వారా విస్తృతంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పరిశ్రమపంథాలో… ప్రణాళికాబద్ధంగా సాగించాలనే ఆలోచనతో ఈ సంస్థ ద్వారా వేగంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక పరిశ్రమగా మరోమారు వెల్లడయ్యేలా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. సంస్థల భాగస్వామ్యం ఉండబోతుంది. పలురీతుల ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు… 6 మధ్యతరహా చిత్రాలు… 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం వల్ల – యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు…. కలలు కార్యరూపం దాల్చే వేదిక రూపుదిద్దుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement