Monday, May 6, 2024

మహేష్, నాని లకు పవన్,చిరు అభినందనలు

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగం నుంచి మహర్షి, జెర్సీ చిత్రాలు అవార్డులకు ఎంపికకావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి చిత్రం నిలవడం అభినందనీయమన్నారు. ఇదే చిత్రానికి ఉత్తమనృత్య దర్శకుడిగా రాజు సుందరం ఎంపికకావడంఆనందాన్నిచ్చిందన్నారు.

అదే విధంగా ఉత్తమ చిత్రంగా జెర్సీ నిలబడటం గొప్ప విషయమని, ఉత్తమ ఎడిటర్ గా నూలి నవీన్ అవార్డుకు ఎంపికైనందుకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలను విజేతలు అందిస్తారన్న ఆకాంక్షను పవన్ వ్యక్తం చేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement